Sun Mar 15 2026 05:58:18 GMT+0530 (India Standard Time)
Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ముంచింది
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.స్థానికసంస్థల ఎన్నికల కోసం నాటకాలాడుతుందన్నారు. ఆయన హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ను నమ్మి రైతులు నిలువునా మోసపోయారన్నారు. పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి పన్నెండు వేలుమాత్రమే ఇస్తామని చెప్పింది.
నిలువునా ముంచి...
ఇప్పటి వరకూ కల్యాణ మస్తు పథకాన్నిఅమలు చేయకుండా నిరుపేద వర్గాలను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిలువునా ముంచిందన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. కేవలం స్థానిక ఎన్నికల కోసమే ఈ డ్రామాలాడుతుందని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బయటకు రాని నేత ప్రజలకు అవసరమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

