Wed Mar 18 2026 05:21:15 GMT+0530 (India Standard Time)
Bandi Sanjay : కేటీఆర్ నోటీసులకు బండి సంజయ్ రెస్పాన్స్ ఇదే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయన తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక కేటీఆర్ ఇలా నోటీసులతో భయపెట్టాలని భావిస్తున్నారని అన్నారు. నోటీసులకు తన విమర్శలే సమాధానమని తెలిపారు.
నోటీసుకు నోటీసు...
తనను అవమానిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాను బదులిచ్చానని ఆయన తెలిపారు. మాటకు మాట.. నోటీసు కు నోటీసులతోనే తన సమాధానం ఉంటుందని బండి సంజయ్ అన్నారు. తాను కూడా నోటీసులు పంపిస్తానని, కాచుకో అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు సమాధానమిచ్చారు.
Next Story

