Wed Jan 28 2026 20:32:30 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఏమన్నారంటే?
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పార్టీ పదవుల విషయంలో బీజేపీ కులాలు చూడదన్న ఆయన ఒక వ్యక్తిని ఉద్ధేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కాని బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని బండి సంజయ్ అన్నారు.
గతంలో బీసీ కోటాలో...
గతంలో బీసీ కోటాలో తనకు, లక్ష్మణ్ కు పార్టీ అవకాశం ఇచ్చిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్ ఎవరికి పార్టీ పదవులు ఇవ్వాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయమని తెలిపారు. బీజేపీలో పక్షపాత వైఖరిని అవలంబించదని, పరిస్థితులు, రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే పదవులను ఇస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
Next Story

