Sat Jan 31 2026 13:01:08 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : బీఆర్ఎస్ విలీనం ఖాయం.. బండి సంజయ్ జోస్యం
బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని అన్నారు.

బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని అన్నారు. అందుకోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. విలీనం కావడానికి అవసరమైన పక్కా ప్లాన్ సిద్ధమయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
కుటుంబ పార్టీలను...
ీబీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ఏమీలేని బీఆర్ఎస్ ను తాము ఎందుకు విలీనం చేసుకుంటామని బండి సంజయ్ ప్రశ్నించారు. తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా బీఆర్ఎస్ ను ఎందుకు విలీనం చేసుకుంటామని బండి సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీ కుటుంబ పార్టీలకు దూరమని బండి సంజయ్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ విలీనం అయిందని, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కలుపుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
Next Story

