Fri Feb 14 2025 01:16:17 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారు? అని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫోటో కూడా ఉండాల్సిందేనని బండిసంజయ్ అన్నారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంటే...పీఎం ఫోటో ఎందుకు పెట్డడం లేదు? అని నిలదీశారు. రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో పెట్టకపోతే... రాష్ట్రానికి ఉచిత బియ్యం ఎందుకివ్వాలి? అంటూ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇందిరమ్మ పేరు పెడితే...
లేనిపక్షంలో నేరుగా పేదలందరికీ కేంద్రమే ఉచితంగా బియ్యం, ఇళ్లు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు. గత పదేళ్లలో దావోస్ పెట్టబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందగానే కేసును అటకెక్కించారా? అంటూ ప్రశ్నించారు. అవినీతిలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్న బండి సంజయ్ రేవంత్ రెడ్డి గురువు కేసీఆరేనని, ఎన్నికలెప్పుడొచ్చినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదేనని ఆయన అన్నారు.
Next Story