Fri Dec 05 2025 10:25:30 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా ఇండ్రస్ట్రీని దెబ్బతీసే కుట్ర : బండి సంజయ్
సినిమా ఇండ్రస్ట్రీని తొక్కేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు

సినిమా ఇండ్రస్ట్రీని తొక్కేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఇండ్రస్ట్రీని దారుణంగా దెబ్బతీశారని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎంతో కలసి వంత పాడుతూ అయిపోయిన ఘటనపై మళ్లీ మాట్లాడి గాయాన్ని రేపారని బండి సంజయ్ ఆరోపించారు.
కావాలని ఈ ఘటనకు...
అల్లు అర్జున్ కావాలని ఆ ఘటనకు బాధ్యులయ్యారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని అందరూ ప్రకటించారని, కేసులు కూడా నమోదయిన తర్వాత ఇన్ని మాటలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. సంథ్యా థియేటర్ ఘటనలో తప్పు ఎవరది? అన్ని న్యాయస్థానాలు తేలుస్తాయని తెలిపారు. గురుకులాల్లో జరిగిన మరణాలకు ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. మీకో న్యాయం? మరొకరికి ఇంకొక న్యాయమా? అని బండి సంయ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

