Thu Jan 29 2026 07:20:13 GMT+0000 (Coordinated Universal Time)
amit shah : అమిత్ షా వాహనానికి కారు అడ్డం... భద్రతా లోపం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రత లోపం కన్పించింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రత లోపం కన్పించింది. అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన హరిత ప్లాజాకు చేరుకున్నారు. హరిత ప్లాజాలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. హరిత ప్లాజా వద్ద జరుగుతున్న ఈ సమావేశానికి అమిత్ షా బయలుదేరగా ఆయన వాహనానికి మరో కారును అడ్డం పెట్టారు. దీంతో ఆయన కాన్వాయ్ ఐదు నిమిషాలు నిలిచిపోయింది.
కారు అద్దాలు పగలగొట్టి...
రిజిస్ట్రేషన్ లేని కారును అక్కడ వదిలేశారు. దీంతో షా భద్రతా సిబ్బంది ఆ కారు వెనక వైపు ఉన్న వాహనాలను పగల గొట్టారు. లోపల ఎవరూ లేరు. ఈ కారు ఎవరు కొనుగోలు చేశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. కావాలనే రిజిస్ట్రేషన్ కారును అక్కడ వదలిపెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. దీనిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

