Tue Mar 17 2026 16:54:03 GMT+0530 (India Standard Time)
11న తెలంగాణకు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 11వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 11వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నారు. పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో అమిత్ షా పర్యటించనున్నారని చెప్పారు.
నేతలకు దిశానిర్దేశం...
పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో పార్టీ నేతలతో సమావేశం కానున్న అమిత్ షా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేతలను అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
Next Story

