Sun Mar 15 2026 15:02:39 GMT+0530 (India Standard Time)
Amit Shah : 17న తెలంగాణకు షా.. ఒకేరోజు నాలుగు సభల్లో
ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన మ్యేనిఫేస్టోను విడుదల చేయనున్నారు

ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన మ్యేనిఫేస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు మ్యేనిఫేస్టోను కూడా విడుదల చేయనుంది. ఇక పదిహేను రోజుల్లో తెలంగాణ ప్రజల్లోకి మ్యానేఫేస్టోను బలంగా తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నించాల్సి ఉంటుంది.
మ్యానిఫేస్టో విడుదల...
ఈ నెల 17న తెలంగానకు రానున్న అమిత్ షా ఒకే రోజు నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ సభల్లో అమిత్ షా హాజరు కానున్నారని పార్టీ నేతలు తెలిపారు. అదే రోజు సోమాజీగూడలోని మీడియా సెంటర్ లో బీజేపీ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. బీజేపీ మ్యానిఫేస్టోలో ఎలాంటి జనాకర్షక పథకాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

