Thu Dec 18 2025 07:29:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ నేతలతో షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సీఐఎస్ఎఫ్ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సీఐఎస్ఎఫ్ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న అమిత్ షా రైజింగ్ పరేడ్ లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేసిన అమిత్ షా సీఐఎస్ఎఫ్ పరేడ్ తర్వాత పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీతో ఆయన సమావేశమయ్యే అవకాశముంది.
పార్టీ బలోపేతానికి...
తెలంగాణలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రణాళికను రచించనున్నారు. నేతలకు పార్టీని మరింత బలోపేతానికి కావాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల వరసగా తెలంగాణ నేతలతో సమావేశమవుతున్న అమిత్ షా ఈ భేటీలోనూ చేరికలపై ఎక్కువా మాట్లాడనున్నారని సమాచారం. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీని పయినంప చేసేలా అమిత్ షా ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Next Story

