Tue Mar 17 2026 16:53:31 GMT+0530 (India Standard Time)
రేపు హైదరాబాద్కు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధానంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరోబలోపేతం చేసే విషయంలో ఆయన పార్టీ నేతలతో చర్చించున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో...
బీజేపీ నేతలకు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలను కూడా ఆయన తెలియజేయనున్నారు. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ పార్టీ నేతలతో వరస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న అమిత్ షా సీఐఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొనన్నారు. ఇది అధికారిక కార్యక్రమం.
Next Story

