Sun Mar 15 2026 15:05:58 GMT+0530 (India Standard Time)
నేడు ఆదిలాబాద్‌కు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్‌కు బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని భారతీయ జనతా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మేధావులతో...
తిరిగి సాయంత్రం 4.15 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.20 గంటలకు అమిత్ షా మేధావులతో సమావేశం కానున్నారు. రాత్రి 7.40 గంటలకు ఐసీసీ కాకతీయ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రికి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story

