Thu Mar 19 2026 03:25:54 GMT+0530 (India Standard Time)
Amit Shah : నేడు తెలంగాణకు అమిత్ షా రాక
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి హెలికాప్టర్ లో సిద్ధిపేట వెళతారు. సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
నేతలతో భేటీ...
అక్కడే పార్టీ నేతలతో సమావేశం అవుతారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నిస్తుంది. అనంతరం ఇక్కడి నుంచి నేరుగా భువనేశ్వర్ కు బయలుదేరి వెళతారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

