Wed Jan 28 2026 23:36:11 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు.హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొంటారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. రాత్రికి హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా లాల్ దర్వాజకు చేరుకుంటారు.
పాతబస్తీలో రోడ్ షో...
అక్కడ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకూ రోడ్ షో నిర్శహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోడ్ షో ముగిసిన అనంతరం నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, చేవెళ్ల పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

