Sat Dec 06 2025 00:36:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్కు షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్కు రానున్నారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్కు రానున్నారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ సమావేశాల కారణంగా RRR టీంతో చిట్ చాట్, బీజేపీ నేతలతో సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. హైదరాబాద్కు వచ్చి నేరుగా చేవెళ్ల సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో పార్టీ అత్యవసర సమావేశం ఉన్నందున ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో కొన్నింటిని రద్దు చేసుకున్నారని తెలిపాయి.
నేరుగా చేవెళ్లకు...
సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని నేరుగా చేవెళ్ల సభకు అమిత్ షా హాజరవుతారు. సభలో ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఉంటారు. ప్రసంగం, చేరికల తర్వాత ఆయన తిరిగి వెంటనే ఢిల్లీకి పయనమై వెళతారని పార్టీ వరగాలు తెలిపాయి. అమిత్ షా ఈరోజు చేవెళ్ల సభలో దేనిపై ప్రసంగించనున్నారన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే పార్టీలో ఎవరు చేరతారన్న దానిపై కూడా చర్చ జరగనుంది.
Next Story

