Tue Mar 17 2026 16:53:45 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు రాత్రికి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు రాత్రికి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. రాత్రికి హైదరాబాద్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం పోలీస్ అకాడమీలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు.
పార్టీ నేతలతో...
అమిత్ షా రాకతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో అమిత్ షా కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితమవుతారని తెలిసింది. అయితే కొందరు పార్టీ ముఖ్యనేతలు అమిత్ షాను ఎయిర్ పోర్టులో కలసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది.
Next Story

