Sun Mar 15 2026 13:27:18 GMT+0530 (India Standard Time)
28న తెలంగాణకు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు అమిత్ షా బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు జిల్లాల్లో పర్యటన...
తర్వాత ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో పర్యటించనున్నారు. పార్టీ నేతలను లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే దిశగానే ఆయన పర్యటన సాగనుంది. ముఖ్యనేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అత్యధిక స్థానాలను సాధించుకునేలా ప్రణాళికను వారి ముందు ఉంచనున్నారు.
Next Story

