Tue Mar 17 2026 20:26:18 GMT+0530 (India Standard Time)
ఈ నెల16న హోంమంత్రి అమిత్ షా రాక
ఈ నెల 16న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఆయన కార్యక్రమం ఖరారయిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 16న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఆయన కార్యక్రమం ఖరారయిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొననున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
బీజేపీ నేతలతో....
అంతకు ముందు ఆయన బీజేపీ నేతలతో ఆయన సమావేశమవుతారు. రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు పార్టీలో చేరికలు తదితర అంశాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికను గెలిచి తీరాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించనున్నారు. అందుకు అవసరమైన వ్యూహాలను ఆయన నేతలకు వివరించనున్నారని చెబుతున్నారు.
Next Story

