Fri Dec 05 2025 22:50:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మునుగోడుకు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు మునుగోడు రానున్నారు. ఆయన బీజేపీ నిర్వహించే సభలో పాల్గొననున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు మునుగోడు రానున్నారు. ఆయన బీజేపీ నిర్వహించే సభలో పాల్గొననున్నారు. చౌటుప్పల్ లో జరిగే ఈ సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరనున్నారు. ఈ సభలో కోమటిరెడ్డితో పాటు మరికొందరు పార్టీలో చేరే అవకాశముందని తెలిసింది. అమిత్ షా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.
పర్యటన ఇదీ....
అనంతరం సికింద్రాబాద్ లోని సభామూర్తినగర్ ఉన్న బీజేపీ దళిత కార్యకర్త ఇంటికి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రోడ్డు మార్గం ద్వారా 3.20 గంటలకు హోటల్ కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకూ రైతులతో సమావేశం అవుతారు. సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ లో మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం ఐదు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆయన రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని గంటసేపు గడుపుతారు. అక్కడి నుంచి నోవాటెల్ కు వచ్చి ముఖ్య నేతలతో రాత్రి 9 గంటల వరకూ సమావేశమవుతారు. రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళతారు
Next Story

