Sun Mar 15 2026 11:56:00 GMT+0530 (India Standard Time)
BJP : నేడు తెలంగాణలో అమిత్ షా
ఈరోజు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నా

తెలంగాణలో పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు వరస పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకూ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి వెళ్లగా నేడు అమిత్ షా పర్యటించనున్నారు. తెలంగాణలో ప్రచారం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేశారు.
భువనగిరిలో నేడు సభ...
ఈరోజు తెలంగాణలో ఆయన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. పార్టీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా సభ విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

