Tue Mar 17 2026 23:45:13 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు అమిత్ షా
హైదరాబాద్ కు నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు

హైదరాబాద్ కు నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఆయన ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరగనున్న రామానానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అమిత్ షా ఈరోజు సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమనికి చేరుకుంటారు.
ముచ్చింతల్ లోని....
సమతా మూర్తి విగ్రహంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్యాలయాలను కూడా అమిత్ షా సందర్శిస్తారు. అమిత్ షా రాక సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే అమిత్ షా నేరుగా ఢిల్లీ బయలు దేరి వెళతారని పార్టీ వర్గాలు చెప్పాయి.
Next Story

