Tue Mar 17 2026 18:34:30 GMT+0530 (India Standard Time)
అమిత్ షా ఆత్మవిశ్వాసం వెనక?
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల నాడి తనకు తెలుసునని, తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన తెలిపారు. అధికారాన్ని కూడా అత్యధిక సీట్లతో చేపడతామని అమిత్ షా ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం విశేషం.
తెలంగాణా మాదే...
దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ బీజేపీకి గేట్ వే అని ఆయన వెల్లడించారు. ఖచ్చితంగా తాను తెలంగాణకు వెళతానని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, ఎన్నికల సమయానికి మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. తాను తెలంగాణకు వెళ్లి పార్టీని గెలుపు దిశగా పయనించేందుకు మరింత ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.
Next Story

