Fri Dec 05 2025 10:57:13 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మనదే
తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు

తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా రైతు సమ్మేళన్ సభలో ప్రసంగించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఈ గడ్డ మీద కాషాయం రెపరెపలాడుతుందన్న నమ్మకం తనకు కుదిరిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటు సభ్యుడు అరవింద్ నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించారని అమిత్ షా చెప్పారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మోదీ మాట ఇచ్చారంటే...?
ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారి మాట ఇచ్చారంటే తప్పరని, కొద్దిగా ఆలస్యమయినా తప్పకుండా నెరవేరుస్తారని అమిత్ షా చెప్పారు. నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదన్నారు. ఇక నిజామాబాద పసుపు రైతులకు తిరుగులేదని, ప్రపంచమంతా ఇక్కడి పసుపతి ఎగుమతి అవుతుందని అమిత్ షా ఆకాంక్షించారు. ఇక నిజామాబాద్ లోనే ారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్ పోర్టు లిమిటెడ్ కూడా ఏర్పాటవుతున్నాయని రైతుల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. భారత్ ఎక్స్ పోర్టు లిమిటెడ్ తో నిజామాబాద్ పపసుు అమెరికా, యూరప్ వంటి దేశాలకు ఎగుమతి అవుతుందని అమిత్ షా చెప్పారు.
రెండు పార్టీల్లోనూ అవినీతి...
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు చేశారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి ఏటీఏంలా మారిందన్నఅమిత్ షా తెలంగాణ బీఆర్ఎస్ పని అయిపోయిందని, కానీ అవినీతి మాత్రం తగ్గలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. నక్సలైట్లు ఇక లొంగిపోవాలని, హత్యకాండను ఆపాలని ఆయన పిలుపు నిచ్చారు. పహాల్గాం దాడి తర్వాత భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందని అన్న అమిత్ షా, ఉగ్రదాడులతో భారత్ ను పాక్ భయపెట్టాలని చూసిందని, ఆపరేషన్ సింధూర్ తర్వత భారత్ ను చూసి తోకముడుచుకుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు.
Next Story

