Sun Mar 15 2026 16:36:19 GMT+0530 (India Standard Time)
RRR టీంతో అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 23న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అమిత్ షా షెడ్యూల్ రెడీ అయింది

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 23న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అమిత్ షా షెడ్యూల్ రెడీ అయింది. ఆయన ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళతారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో RRR టీంతో అమిత్ షా భేటీ అవుతారు. ఇటీవల ఆస్కార్ అవార్డు లభించడంతో ఆ టీంను అమిత్ షా అభినందిస్తారు.
ఎల్లుండి తెలంగాణకు...
సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతుంది. సాయంత్రం 5.15 గంటలకు అమిత్ షా చేవెళ్ల సభకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్ షా బహిరంగ సభలో పాల్గొంటారు. - తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీకి పయనమవుతారు. అమిత్ షా పర్యటనలో పలు చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Next Story

