Sun Feb 01 2026 21:36:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ కు అమిత్ షా
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు.

నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ విమోచన అమృతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా పరడే గ్రౌండ్స్ లో ఈ నెల 17వ తేదీన జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
రేపు బీజేపీ కోర్ కమిటీ....
ఈరోజు రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా పోలీస్ అకాడమీలో బస చేయనున్నారు. రేపు ఉదయం జరిగే విమోచన దినోత్సవాల్లో పాల్గొంటారు. ఏడు కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరస్తారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు పాల్గొంటారు. అనంతరం అమిత్ షా టూరిజం ప్లాజాలో జరిగే బేజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

