Thu Mar 19 2026 04:14:04 GMT+0530 (India Standard Time)
కృష్ణంరాజు కుటుంబాకి రాజనాథ్ సింగ్ పరామర్శ
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సినీనటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సినీనటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఇంటికి చేరుకున్న కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సంస్మరణ సభలో....
రాజ్నాథ్ సింగ్ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వచ్చిన వ్యాధి, అందించిన చికిత్స గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాజ్నాథ్ సింగ్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. అనంతరం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు.
Next Story

