Thu Mar 26 2026 08:56:18 GMT+0530 (India Standard Time)
నేడు నల్లగొండలో నిరుద్యోగ సభ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో నిరుద్యోగ సభ జరగనుంది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో నిరుద్యోగ సభ జరగనుంది. ఈ సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మహాత్మా గాంధీ యున్నివర్సిటి విద్యార్థులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
పాదయాత్ర అనంతరం ....
అనంతరం మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్ టవర్ కు పాదయాత్ర నిర్వహిస్తారు. తర్వాత క్లాక్ టవర్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. నిరుద్యోగ సభకు పెద్దయెత్తున యువతను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఈ నెల 26వ తేదీన సభ జరగాల్సి ఉండగా వాయిదా పడి నేడు జరగనుంది. తెలంగాణలో నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నేతల ప్రసంగాలు కొనసాగనున్నాయి.
- Tags
- congress
Next Story

