Wed Feb 19 2025 21:58:10 GMT+0000 (Coordinated Universal Time)
కింగ్ ఫిషర్ బీర్లు ఇక తాగేయొచ్చు.. లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్
లిక్కర్ లవర్స్ కు యూబీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వల పై స్పందించింది

లిక్కర్ లవర్స్ కు యూబీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వల పై స్పందించింది. రానున్న వేసవిలో తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు దొరికే అవకాశం లేదన్న వార్తలు నేపథ్యంలో చల్లటి కబురు చెప్పింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కన్నారు. ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూల స్పందించిందని తెలియజేసింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీ సంస్థ ప్రకటించింది.
బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తామని...
వినియోగదారులు కార్మికులు వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం నుంచి హామీ రావడంతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించడంతో లిక్కర్ లవర్స్ ఊపిరి పీల్చుకున్నారు.
అత్యధికంగా అమ్ముడయ్యే...
గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడటంతో మందు బాబులకు కిక్కిచ్చే న్యూస్ తెలిపింది. నిజానికి బీర్లలో మద్యం ప్రియులు కింగ్ ఫిషర్ ను రారాజుగా చూస్తారు. తెలంగాణలో అమ్ముడవుతున్న బీర్లలో 70 శాతం బీర్లు కింగ్ ఫిషర్ కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. అత్యధికంగా ఆదాయం కూడా ఆదాయం యూబీ సంస్థకు తెచ్చిపెట్టేది కూడా తెలంగాణ నుంచి మాత్రమే. అలాంటిది ఈ మార్కెట్ నుంచి బయటకు వెళ్లడానికి సహజంగా ఏ సంస్థ కఠిన నిర్ణయం తీసుకోదు. మద్యం ప్రియులపై ఎక్కువ భారం మోపకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం భావించి ధరల పెంపుదలకు ఒప్పుకోలేదు. ధరలు పెంచకపోయినా తన లాభాలను తగ్గించుకోవడానికి, మేజర్ గా వచ్చే లాభాలను కోల్పోవడానికి యూబీ సంస్థ ఎందుకు పూనుకుంటుంది? అదే ఇప్పుడు నిజమైంది. యూబీ సంస్థ ఎట్టకేలకు దిగి వచ్చింది. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను కొనసాగిస్తామని పేర్కొంది.
Next Story