Sun Dec 14 2025 11:03:55 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఓటుకు వెళుతూ ఇద్దరు యువకుల మృతి
బైక్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు

పంచాయతీ ఎన్నికల రెండో దశలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను హనుమకొండ జిల్లా ఇనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బుర్ర కల్యాణ్, నవీన్ లు గా గుర్తించారు. వీరిద్దరూ హైదరాబాద్లో నివసిస్తూ, ఓటు వేయడానికి తమ గ్రామానికి బైక్పై బయలుదేరారు.
గుర్తు తెలియని వాహనం...
స్టేషన్ ఘన్పూర్కు సమీపంలోని రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వారి బైక్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story

