Sat Mar 07 2026 20:11:25 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ పాదచారులకు గుడ్ న్యూస్..
ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో పాదచారులకు జాతీయ రహదారి 65 దాటడం సులభతరం కానుంది. చందానగర్ లో ఉన్న ఈ రెండు బ్రిడ్జీలను

చందానగర్ : భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై.. పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చాలాసార్లు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. పాదచారుల కష్టాలను గుర్తించిన అధికారులు పలు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను నిర్మించారు. చందానగర్ లో పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు. దీప్తి శ్రీ నగర్ ఎంట్రన్స్ ఎదురుగా జాతీయ రహదారి 65 పై రూ.5.5 కోట్లు, పీజేఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ. 5.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో పాదచారులకు జాతీయ రహదారి 65 దాటడం సులభతరం కానుంది. చందానగర్ లో ఉన్న ఈ రెండు బ్రిడ్జీలను గురువారం ప్రభుత్వ విప్ శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ లు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 ప్యాకేజీల ద్వారా రూ. 127.3 కోట్లు వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. శేరిలింగంపల్లిలో రూ.39.70 కోట్ల వ్యయంతో 5 వంతెన పనులను ప్రతిపాదించగా.. రెండు పూర్తయ్యాయి. మరో మూడు వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి.
Next Story

