Sat Nov 08 2025 00:17:46 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే బీమా ఏదీ?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బీమా సౌకర్యం కల్పించడం లేదు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బీమా సౌకర్యం కల్పించడం లేదు. ప్రతి ప్రయాణికుడి నుంచి రూపాయి సేఫ్టీ సెస్ పేరుతో వసూలు చేస్తున్నప్పటికీ బస్సు ప్రమాదానికి గురైతే వారికి బీమా సౌకర్యం వర్తించేలా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు ఎటువంటి బీమా రక్షణ అందడం లేదు.
ఆర్టీసీ నుంచే పరిహారం...
బస్సు ప్రమాదాల్లో మరణించిన వారిని బట్టి కుటుంబాలకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే పరిహారం ఇస్తున్నారు. అది కూడా ఆర్టీసీ నిధుల నుంచే వస్తోంది. ప్రయాణికుల కోసం ప్రత్యేక బీమా పథకం మాత్రం లేదు. మరి ఇప్పటికైనా ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు వారికి బీమా కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారతీయ రైల్వే మాత్రం ప్రతి ప్రయాణికుడికి కనీసం మూడు లక్షల బీమా కవరేజీని కల్పిస్తోంది. మృతి చెందితే ఆ మొత్తం ఎనిమిది లక్షల రూపాయలకు పెరుగుతుంది. అదనంగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా సాయమూ ఇస్తుంది. కానీ ఆర్టీసీ ప్రయాణికులకు మాత్రం ఎలాంటి బీమా భద్రత లేదు.
Next Story

