Sat Dec 06 2025 09:56:17 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
టీఎస్ ఆర్టీసీ రాయితీతో కూడిన ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటన చేశారు

అయ్యప్పస్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి.. అదనంగా నష్టపోకుండా.. టీఎస్ ఆర్టీసీ రాయితీతో కూడిన ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటన చేశారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ కు ఉచితంగా ప్రయాణం కల్సిస్తామని ప్రకటించారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితమన్నారు.
అయ్యప్పస్వాములు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణలో తాము కోరుకున్న ప్రదేశం నుండి దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల వరకు నడుపబడుతాయని వివరించారు. ముందస్తు సీట్ల రిజర్వేషన్లకై, శబరిమల యాత్రకై ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కొరకు www.tsrtconline.in సంప్రదించాలని సూచించారు. సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు కాల్ సెంటర్ 040 23450033, 69440000 నెంబర్లను సంప్రదించవచ్చు.
- Tags
- tsrtc
- sabarimala
Next Story

