Tue Nov 28 2023 16:34:21 GMT+0000 (Coordinated Universal Time)
దసరాకు ఊరికి వెళుతున్నారా? అయితే గుడ్ న్యూస్
టీఎస్సార్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు వెళ్లే ప్రయాణికులకు రాయితీలను ప్రకటించింది.

టీఎస్సార్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు వెళ్లే ప్రయాణికులకు రాయితీలను ప్రకటించింది. అయితే ఇందుకోసమ ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దసరా పండగకు ఇటు ఏపీకి అటు తెలంగాణకు ఎక్కువ మంది తమ సొంతూళ్లకు బయలుదేరి వెళుతుంటారు. వీరి కోసం టీఎస్ఆర్టీసీ రాయితీలను ప్రకటించింది. ముందుగా అడ్వాన్స్ టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ ధరలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
పది శాతం...
దసరా అంటే అందరి పండగ. ఎక్కువ మంది సొంతూళ్లకు బయలుదేరి వెళతారు. తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ. అందుకే టీఎస్ఆర్టీసీ ఈ వెసులుబాును కల్పించింది. ఈ నెల 30వ తేదీ వరకూ ముందుగా రిజర్వేషన్ చేయించుకునే వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. వారికే రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి పది శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సో.. దసరాకు వెళ్లే వాళ్లు ముందుగా తమ టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకుని రాయితీ పొందడమే కాకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని చేయమని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
Next Story