Fri May 03 2024 23:06:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కరోనా అప్ డేట్
ఇదే సమయంలో 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకూ తెలంగాణలో..
హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,072 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 72 మందికి పాజిటివ్ గా తేలింది. వీటిలో అత్యధిక కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. హైదరాబాద్ లో 35 కేసులు నమోదవ్వగా.. పలు జిల్లాల్లో కరోనా కొత్తకేసులు నమోదు కాలేదు.
ఇక ఇదే సమయంలో 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకూ తెలంగాణలో 7,90,989 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 7,86,241 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 637 యాక్టివ్ కేసులుండగా.. వారంతా చికిత్స పొందుతున్నారు. కాగా.. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 4,111 గా ఉంది.
Next Story