Fri Dec 05 2025 14:59:18 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
2022-23 విద్యా సంవత్సరంలో 1 నుండి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల..

తెలంగాణలో స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులను ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుండి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. 1 నుండి 9వ తరగతుల విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
మార్చి రెండో వారంలో ఒంటిపూట బడులు
అలాగే.. మార్చి రెండో వారం నుంచీ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21న ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. వేసవి సెలవుల అనంతరం అన్ని పాఠశాలలు తిరిగి జూన్ 12న పునః ప్రారంభమవుతాయి.
Next Story

