Fri Jan 30 2026 18:56:13 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికలు ఎప్పుడొచ్చినా 90 సీట్లు మావే
ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారంటీగా వస్తాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారంటీగా వస్తాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాము చేయించుకున్న సర్వేలో 90 సీట్లు వస్తాయని తేలిందన్నారు. మొన్న బీజేపీ, నిన్న కాంగ్రెస్ చేయించిన సర్వేల్లోనూ టీఆర్ఎస్ దే గెలుపని తేలిందన్నారు. విపక్షాల సర్వేలు కూడా టీఆర్ఎస్ గెలుస్తాయని చెబుతున్నాయని కేటీఆర్ అన్నారు.
ఎవరికీ అదరడు...
మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మోడీ, ఈడీ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎవరికీ అదరడు, బెదరడు అని అన్నారు. త్వరలో పింఛన్లను మంజూరు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
Next Story

