Thu Feb 05 2026 10:47:03 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మగౌరవానికే మునుగోడు ప్రజలు పట్టం: కేటీఆర్
మునుగోడులో ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా

మునుగోడులో ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన గులాబీ దండుకు అభినందనలు ఆయన తెలియజేశారు. సీీపీఎం, సీపీఐ నేతలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బలవంతపు ఎన్నికను తెలంగాణ ప్రజలపై బీజేపీ నేతలు రుద్దారని ఆయన అన్నారు. రుద్దిన వాళ్లకు గుద్దిన గుద్దుడుతో ఆ పార్టీకి చక్కరొచ్చిందని కేటీఆర్ అన్నారు.
కోట్లు ఖర్చు చేసినా...
తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి వేయడమే కాకుండా తెలంగాణలోనూ కూల్చేందుకు ప్రయత్నించిన బీజేపీ అహంకారాన్ని మునుగోడు ప్రజలు తొక్కేశారన్నారు. బీజేపీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజాతీర్పును పొందలేకపోయిందన్నారు. ఈ ఎన్నికను బీజేపీ డబ్బుమయం చేసిందన్నారు. ఢిల్లీ నుంచి డబ్బు సంచులు తెచ్చారన్నారు. కోట్ల రూపాయల బీజేపీ నేతల డబ్బు పోలీసులకు దొరికిపోయిందన్నారు. అనేక సందర్భాల్లో బీజేపీ నేతల అనుచరుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకోవడం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
జనం గొంతునొక్కాలని...
జనం గొంతునొక్కాలని బీజేపీ ప్రయత్నించిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించి భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. వందల కోట్లు ఖర్చు చేసినా ఆ పార్టీ గెలవలేకపోయిందన్నారు. లేకుంటే తమ పార్టీకి మరిన్ని ఓట్లు రావాల్సి ఉందని, మెజారిటీని తగ్గించగలిగారని కేటీఆర్ అన్నారు. తమను దెబ్బతీయడానికి తమ అనుచరులను రంగంలోకి దించిందన్నారు. రోడ్డురోలర్, చపాతీ రోలర్ వంటి గుర్తులకు ఐదు వేల ఓట్లు పై చిలుకు వచ్చాయని తెలిపారు. అందుకే మెజారిటీ తమకు తగ్గిందన్నారు కేటీఆర్. బీజేపీ ఒక ఫేక్ పార్టీ అని కేటీఆర్ మండి పడ్డారు. వామపక్షాలతో భవిష్యత్ తో పొత్తు విషయంపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.
Next Story

