Fri Dec 05 2025 17:32:18 GMT+0000 (Coordinated Universal Time)
డిఎస్పి సమక్షంలోనే కేఏ పాల్ పై టిఆర్ఎస్ శ్రేణుల దాడి
సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరగ్గా.. కేఏ పాల్ పై దాడి తాలూకు వీడియోలు నెట్టింట్లో వైరల్ ..

సిరిసిల్ల : ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరగ్గా.. కేఏ పాల్ పై దాడి తాలూకు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డిఎస్పి అక్కడ ఉండగానే.. ఇదంతా జరగడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని పరామర్శించేందుకు కేఏ పాల్ సిరిసిల్లకు వస్తున్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. డీఎస్పీ సమక్షంలోనే కేఏ పాల్ పై దాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ దాడి జరిగిన తర్వాత వెంటనే పోలీసులు కేఏ పాల్ ను కారులో కూర్చోబెట్టి అక్కడి నుండి పంపించేశారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని పాల్ విమర్శలు చేశారు. తనపై దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ లు ఉన్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బండారం బయటపెడుతున్నందుకే తనపై దాడి చేశారన్నారు.
Next Story

