Tue Jan 20 2026 23:34:04 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో నేడు కేసీఆర్ సభ
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నేడు చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నేడు చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. లక్ష మందిని ఈ సభకు తరలించాలన్న ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు. నవంబరు 1వ తేదీతో ప్రచారం ముగియనుండటంతో ఈరోజు చివరి సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. గతంలో కేసీఆర్ సభ పెట్టినా అప్పుడు అభ్యర్థిని ప్రకటించలేదు.
ఫాం హౌస్ వ్యవహారంపై....
ఇక తాజాగా కేసీఆర్ బహిరంగ సభలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మొయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారంలో ఇప్పటి వరకూ కేసీఆర్ మాట్లాడలేదు. బహిరంగ సభలో ఆ విషయాన్ని ప్రస్తావించే అవకాశముంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోసారి కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

