Wed Mar 25 2026 19:22:55 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీలో కేసీఆర్ ధర్నా
ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆందోళనకు దిగనుంది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.

ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆందోళనకు దిగనుంది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ ధర్నాలో పొల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా ధర్నాలో పాల్గొననున్నారు.
యాసంగిలో....
యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. పంజాబ్ తరహాలోనే మొత్తం ధాన్యం సేకరణను జరపాలని కోరుతుంది. దేశమంతా ఒకే విధానాన్ని ధాన్యం సేకరణలో అమలు పర్చాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకూ వివిధ దశల్లో ఆందోళన చేసిన టీఆర్ఎస్ నేడు ఢిల్లీలోనే ధర్నాకు దిగనుంది.
Next Story

