Wed Feb 19 2025 22:21:43 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ ఎంపీల సంచలన నిర్ణయం
టీఆర్ఎస్ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

టీఆర్ఎస్ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నుంచి వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది మంది లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఈ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
నల్లచొక్కాలు ధరించి....
తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏడు రోజుల నుంచి ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు. కాని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలకు తాము హాజరు కాబోవడం లేదని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు తెలిపారు. ఈరోజు పార్లమెంటు ఉభయ సభలకు నల్ల చొక్కాలు ధరించి హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.
Next Story