Sat Mar 07 2026 18:00:28 GMT+0530 (India Standard Time)
బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇన్నాళ్లు అవాకులు, చవాకులు పేలిన వారి నోళ్లు మూత బడ్డాయని కవిత అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం చెప్పారని కవిత అన్నారు.
హ్యాట్రిక్ విజయాలను...
నల్లగొండ జిల్లాలో హ్యాట్రిక్ విజయాలను సాధించామని తెలిపారు. ఇక ఏ ఎన్నిక జరిగినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆ పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో యాభై లక్షలతో స్వామి వారికి రథాన్ని ఏర్పాటు చేయిస్తానని కవిత హామీ ఇచ్చారు.
Next Story

