Thu Mar 19 2026 04:58:56 GMT+0530 (India Standard Time)
ఈడీ ఎదుట హాజరుకాని రోహిత్ రెడ్డి
ీటీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరుకాలేదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరుకాలేదు. తనకు కొంత సమయం కావాలంటూ ఆయన తన పీఏ ద్వారా ఈడీ అధికారులకు లేఖ పంపినట్లు తెలిసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని, మనీలాండరింగ్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలతో పాటు, ఆయన, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపారాల వివరాలను కోరారు.
ప్రగతి భవన్ కు వెళ్లిన తర్వాత....
అయితే ఈరోజు ఉదయం రోహిత్ రెడ్డి ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లారు. ప్రగతి భవన్ కు వెళ్లిన రోహిత్ రెడ్డి తన న్యాయవాదులతో సంప్రదించినట్లు తెలిసింది. ఆ తర్వాతే ఆయన తనకు కొంత సమయం కావాలని గడువు కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు ఇప్పుడు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

