Fri Dec 05 2025 15:32:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాణానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
తాను డ్రగ్స్ వాడలేదని, తనకు డ్రగ్స్ కేసులో సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు

తాను డ్రగ్స్ వాడలేదని, తనకు డ్రగ్స్ కేసులో సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. బీజేపీ నేతల సవాల్ కు ఆయన స్పందించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని బండి సంజయ్ ఇక్కడకు వచ్చి ప్రమాణం చేయాలని రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. లేని పోని ఆరోపణలు చేసి పార్టీని, తనను ఇబ్బంది పెట్టే ఆలోచనలను మానుకోవాలని రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
అధికార దుర్వినియోగం...
బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. తమ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చానని, దమ్ముంటే బండి సంజయ్ రావాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. బీజేపీ తనకు అనుకూలంగా లేని వారిపై దర్యాప్తు సంస్థలను ఉపయోగించి భయపెట్టాలని చుూస్తుందన్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రఘునందన్ రావు వేల కోట్లు ఎలా సంపాదించారని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించడం నిజం కాదా? అని ఆయన నిలదీశారు.
Next Story

