Sat Mar 07 2026 21:02:22 GMT+0530 (India Standard Time)
టోల్ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే
మంచిర్యాల జల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన అనుచరులతో కలసి వీరంగం సృష్టించారు.

మంచిర్యాల జల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన అనుచరులతో కలసి వీరంగం సృష్టించారు. తన వాహనానికి రూట్ క్లియర్ లేదని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలసి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు.
రూట్ క్లియర్ చేయలేదని...
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story

