Fri Jan 30 2026 23:11:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
అధికార తెలంగాణ రాష్ట్రసమితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆందోళనలను వ్యక్తం చేయనుంది.

అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా బీజేపీ పై కూడా తమ ఆందోళనలను వ్యక్తం చేయనుంది. మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ ఈ నిరసనలను తెలియజేసి కేంద్ర ప్రభుత్వానికి మంట పుట్టించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి....
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులతో సమావేశమై సమస్యపై చర్చించినా ఫలితం లేకుండా పోయింది. దీంతోనే ఆందోళనకు దిగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయనున్నారు.
Next Story

