Fri Aug 12 2022 02:55:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆ అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు

తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ఎంపీలందరూ మార్గరెట్ ఆల్వాకు ఓటు వేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ చివరి రోజు క్లారిటీ ఇచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో...
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది. అయితే ఉప రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో కొంత అనుమానం తలెత్తింది. మమత బెనర్జీ తరహాలోనే ఎన్నికలకు దూరంగా ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. అయితే చివరకు కాంగ్రెస్ అభ్యర్థి అయినా సరే ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
Next Story