Sat Mar 07 2026 20:59:05 GMT+0530 (India Standard Time)
నేడు మునుగోడు అభ్యర్థి ఖరారు
మునుగోడు అభ్యర్థి పేరును నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేయనున్నారు.

మునుగోడు అభ్యర్థి పేరును నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో నేడు అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరునే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కూసుకుంట్ల ప్రచారంలో పాల్గొంటుండటం కూడా ఇందుకు ఉదాహరణ.
అన్ని పార్టీలు....
మునుగోడు ఉప ఎన్నికకకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. కాంగ్రెస్ ఇప్పటికే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖరాయినట్లే. ఈ నేపథ్యంలో ఈరోజు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించనున్నారు. త్వరలోనే మునుగోడులో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.
Next Story

