Sat Dec 06 2025 10:38:57 GMT+0000 (Coordinated Universal Time)
కూసుకుంట్లకు రూ.40 లక్షలిచ్చిన కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫారం అందచేశారు

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫారం అందచేశారు. కూసుకుంట్ల మర్యాద పూర్వకంగా ఈరోజు కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ బీఫారం తో పాటు నలభై లక్షల రూపాయల చెక్కును కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అందచేశారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుంచి ఈ మొత్తాన్ని కేసీఆర్ ఆయనకు అందజేశారు.
గెలిచి వచ్చి...
ఈ సందర్బంగా తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని, గెలిచి వచ్చి మునుగోడును కేసీఆర్ కు కానుకగా సమర్పిస్తానని ఆయన తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను మోసం చేశారని తెలిపారు. ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
Next Story

