Sat Dec 06 2025 07:51:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి రెండు రోజులు ఎమ్మెల్యేలకు శిక్షణాతరగతులు
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నేటి నుంచి జరగనున్నాయి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నేటి నుంచి జరగనున్నాయి. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎంపికయిన నూతన ఎమ్మెల్యేలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరవుతారు. ఉభయ సభల్లో జరిగే సభ సంప్రదాయాలు, అనుసరించాల్సిన పద్ధతులను గురించి వివరించనున్నారు.

బీఆర్ఎస్ నేతలు బాయ్ కాట్...
అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. తాము ఈ ఓరియెంటేషన్ కార్యక్రమానికి హాజరు కావడం లేదని బీఆర్ఎస్ ప్రకటించింది. అసెంబ్లీలోకి తమను అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా తాము ఈ ఓరియంటేషన్ కార్కక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. తమ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించినందున తాము ఈ సెషన్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ కార్యక్రమం జరగనుంది.
Next Story

